ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారని ఘర్షణ
ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారనే విషయమై ఇరు కుటుంబాలు గొడవపడ్డారు. అందులో ఒకరు అస్వస్థతకు గురై మృతిచెందారు.
అస్వస్థతకు గురై ఒకరి మృతి
సోమరవాండ్లపల్లి (కనగానపల్లి), న్యూస్‌టుడే : ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారనే విషయమై ఇరు కుటుంబాలు గొడవపడ్డారు. అందులో ఒకరు అస్వస్థతకు గురై మృతిచెందారు. ఈ ఘటన కనగానపల్లి మండలంలోని సోమరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరాములు(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న కుటుంబ సభ్యులు శ్రీరాములు ఇంటి ముందు రోజూ నీళ్లు పోస్తున్నారని రెండు కుటుంబాలు గొడవపడ్డారు. ఒకరినొకరు వాదించుకునే క్రమంలో శ్రీరాములు అస్వస్థతకు గురై నేలవాలాడు. చికిత్స నిమిత్తం రామగిరి మండలంలోని ఎగువపల్లికి తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతూ ఒక్కసారిగా రక్తపోటు అధికమై కింద పడ్డాడు. ఆటోలో ధర్మవరానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?