logo

విద్యార్థినిపై అత్యాచారం

చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో 7వ తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితురాలి తండ్రి బుధవారం అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం...

Published : 02 Feb 2023 05:24 IST

స్నేహితురాలి తండ్రే నిందితుడు

హిందూపురం, న్యూస్‌టుడే: చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో 7వ తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితురాలి తండ్రి బుధవారం అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలో సాయంత్రం విద్యార్థులు ఆడుకొంటుండగా అదే గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఈ విద్యార్థినిని మీ అమ్మ సమీప గ్రామ సచివాలయంలో ఉంది. నువ్వు సంతకం పెట్టాలని తీసుకొని రమ్మందని చెప్పి, ఎవరికీ అనుమానం రాకుండా మరో ఇద్దరు విద్యార్థినులను తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని వెళ్లాడు. గ్రామం దాటగానే మిగిలిన వారిని దించేసి బాలికను తీసుకెళ్లాడు. అక్కడ నుంచి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. గంట అనంతరం బాలికను ఇంటి వద్ద వదలి వెళ్లిపోయాడు. శరీరంపై గీతలు పడి ఉండటం, రక్తస్రావం కావడంతో బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి చిలమత్తూరు పోలీసులకు అప్పగించారు. అతడిపై  పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు దొంగతనాలు, ఇతరత్రా కేసులు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు