logo

తండ్రిని హతమార్చిన తనయుడి అరెస్టు

తండ్రిని లారీతో తొక్కించి చంపిన కొడుకును అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి వెల్లడించారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Published : 03 Feb 2023 06:07 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: తండ్రిని లారీతో తొక్కించి చంపిన కొడుకును అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి వెల్లడించారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రి శివానగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, మహమ్మద్‌షఫీ తండ్రీ కొడుకులు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కలసి మద్యం తాగి గొడవ పడుతుంటారు. వీటిని భరించలేక షఫీ మొదటి భార్య విడాకులు ఇచ్చింది. దీంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వీరి గొడవలు చూసి పుట్టింటికి వెళ్లిపోయింది. తన సంసారం ఇలా అయ్యేందుకు తండ్రే కారణమని భావించి చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో తాడిపత్రి నుంచి డక్కిలికి సిమెంటు లోడుతో బుధవారం ఇద్దరూ వచ్చారు. దారిలో చిన్న ఓబయ్య కూడా ఈ పని నిమిత్తం లారీ ఎక్కాడు. పి.పి.గుంట వద్దకు వచ్చేసరికి లారీని ఓబయ్యను తోలమని తండ్రి, కొడుకు గొడవకు దిగారు. మర్రిపాడు మండలంలోని రాజుపాలెం వచ్చేవరకు వాదులాడుకుంటున్నారు. ఇక్కడ లారీ ఆపమని చెప్పి మహబూబ్‌బాషా దిగి నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో ఆగ్రహంతో రఫీ లారీ నడిపి నడచుకుంటూ వెళుతున్న తండ్రిని ఢీకొట్టి తొక్కించి డక్కిలి వైపు వెళ్లాడు. భయంతో చిన్నఓబయ్య అడవిలోకి పారిపోయాడు. ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. కలువాయి మండలంలోని వెంకటరెడ్డిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద షఫీని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు