logo

గ్యాస్‌ లీకై ఎగిసిన మంటలు

గ్యాస్‌ లీకై మంటలు రేగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరవకొండ పదోవార్డు రంగావీధిలో రామాంజనేయులు అనే చేనేత కార్మికుడి ఉమ్మడి కుటుంబం నివాసం ఉంటోంది.

Published : 03 Feb 2023 06:09 IST

ముగ్గురికి తీవ్ర గాయాలు గాయపడిన రామాంజనేయులు, గిరిప్రసాద్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: గ్యాస్‌ లీకై మంటలు రేగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరవకొండ పదోవార్డు రంగావీధిలో రామాంజనేయులు అనే చేనేత కార్మికుడి ఉమ్మడి కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం రాత్రి ఇంట్లో సిలిండర్‌ అయిపోయింది. కొత్తది పెట్టేందుకు మూత తెరవగా వాషర్లు లేకపోవడంతో ఒక్కసారిగా గ్యాస్‌ లీకైంది. సమీపంలోని దేవుని కట్టపై వెలుగుతున్న దీపాల నుంచి మంటలు ప్రారంభమయ్యాయి. రామాంజనేయులుతోపాటు కుమారులు రుషేంద్ర, గిరిప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి మంజుల స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు భారీగా తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అర్బన్‌ సీఐ హరినాథ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి చెందిన చేనేత మగ్గాలు దెబ్బతినడంతో పాటు ఇంట్లోని పలు వస్తువులు కాలిపోయాయి.

సిలిండరు నుంచి మంటలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని