logo

అనంత మదిలో కళాతపస్వి..!

అనంత నగరానికి కళాతపస్వి విశ్వనాథ్‌తో అనుబంధం ఉంది. మొదటి రోడ్డులో ఉన్న త్యాగరాజ సంగీత సభ 58వ వార్షికోత్సవాలకు 2016, సెస్టెంబరు 11న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 03 Feb 2023 06:09 IST

త్యాగరాజ సంగీతసభలో జరిగిన కార్యక్రమంలో విశ్వనాథ్‌

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: అనంత నగరానికి కళాతపస్వి విశ్వనాథ్‌తో అనుబంధం ఉంది. మొదటి రోడ్డులో ఉన్న త్యాగరాజ సంగీత సభ 58వ వార్షికోత్సవాలకు 2016, సెస్టెంబరు 11న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ప్రముఖ నృత్యకారిణి పద్మినీ ప్రకాష్‌ నృత్యప్రదర్శనను ఆయన తిలకించారు. ఇంద్రధనుస్సులాంటి హావభావాలు.. పదభంగిమలు.. తెలుగు సాహిత్య పదసంపద... మన సామాజిక దృక్కోణ నైతిక విలువలు... ఇవన్నీ కలగలిపినవి ఆయన సినిమాలు.. తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. నగరంలో నాడు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అప్పట్లో  ‘న్యూస్‌టుడే’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

ఏమన్నారంటే.. ‘1987లో అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చినట్లు గుర్తు. నగరానికి రెండోసారి రావడం సంతోషకరంగా ఉంది. బాల్యం నుంచే పరభాషా వ్యామోహాన్ని తగ్గించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, ప్రభుత్వాలు, కార్యాలయాల్లో ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తే అభివృద్ధి అదే జరుగుతుంది. పరభాషా పదాలను వాడటం ఎక్కువగానే ఉంది. కాలానుగుణంగా కొన్ని పదాలను తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. మన సినిమాలు విదేశాల్లోని ప్రేక్షకులకు అర్థమవ్వాలని తీస్తున్నారు. తెలుగులో మూడు పదాలు చెప్పమంటే సిరి సిరి మువ్వ’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని