logo

తహసీల్దార్‌ కార్యాలయాల్లో గుడిసెలు వేస్తాం

‘నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి తహసీల్దార్లు చిన్నచూపు చూస్తున్నారు. అదే వైకాపా నేతలు అడిగిందే తడువు ఆగమేఘాలపై కబ్జా భూములకు ఎన్‌ఓసీలు ఇచ్చేస్తున్నారు.

Published : 03 Feb 2023 06:09 IST

30 గంటల సత్యాగ్రహ దీక్ష విరమణ

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి తహసీల్దార్లు చిన్నచూపు చూస్తున్నారు. అదే వైకాపా నేతలు అడిగిందే తడువు ఆగమేఘాలపై కబ్జా భూములకు ఎన్‌ఓసీలు ఇచ్చేస్తున్నారు. ఈనెల 8లోపు ఇంటి పట్టాలు, స్థలాలు ఇవ్వకపోతే తహసీల్దారు కార్యాలయాల్లోనే గుడిసెలు వేయిస్తాం’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో అనంత కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 30 గంటల సత్యాగ్రహ దీక్ష గురువారం ముగిసింది. రాంభూపాల్‌ మాట్లాడుతూ ఎంతో కాలంగా అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు. జిల్లాలో 68వేల ఇళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు తప్ప ఏమీ ఒరగలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ ఇంటి పట్టాలు, స్థలాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. సత్యాగ్రహ దీక్షకు స్పందించిన ఆర్డీఓ మధుసూదన్‌ శిబిరానికి వచ్చారు. పేదల నుంచి అర్జీలు తీసుకున్నారు. వారంలోపు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, శ్రీనివాసులు, నాగేంద్రకుమార్‌, బాలరంగయ్య, సావిత్రి, కృష్ణమూర్తి, తరిమెల నాగరాజు, శివకుమార్‌, రామిరెడ్డి, ఆర్‌వీ నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రయాదవ్‌, ప్రధాన కార్యదర్శి పరమేష్‌, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి నరసింహారెడ్డి, ముస్కీన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని