యూటీఎఫ్ నాయకులకు గృహ నిర్బంధం నోటీసులు
కృష్ణా జిల్లాలో చేపట్టిన సంకల్పదీక్షకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తూ యూటీఎఫ్ నాయకులకు గురువారం రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
యూటీఎఫ్ నాయకులకు నోటీసులిస్తున్న ఎస్సై ఇసాక్
కదిరి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాలో చేపట్టిన సంకల్పదీక్షకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తూ యూటీఎఫ్ నాయకులకు గురువారం రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీపీఎస్ రద్దు డిమాండుతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంకల్పదీక్ష చేపట్టారు. దీక్ష కృష్ణాజిల్లాలోని ధర్మస్థలిలో ఈనెల 3, 4, 5 తేదీల్లో చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. దీక్షకు గురువారం రాత్రి బయల్దేరనున్న సంఘం నాయకులు తాహెర్‌వలి, శ్రీనివాసులు, ఆనంద్, ఆజంబాషా, డి.శ్రీనివాసులు, ఖాజాపీర్, ఖాజా, వెంకటరమణనాయక్, సుబ్బారెడ్డిలకు ఎస్సై ఇసాక్ నోటీసులు అందజేశారు. దీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా దీక్షకు వెళ్లే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంఘం జిల్లా కార్యదర్శి తాహెర్‌వలి మాట్లాడుతూ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్