logo

గ్రేడ్‌ 2 మున్సిపాలిటీగా పుట్టపర్తి

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీ నుంచి గ్రేడ్‌2 మున్సిపాలిటీగా అవతరించింది. చిత్రావతినది ఒడ్డున కొండకోనల్లోని కుగ్రామమైన గొల్లపల్లి.. నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడింది.

Published : 03 Feb 2023 06:09 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీ నుంచి గ్రేడ్‌2 మున్సిపాలిటీగా అవతరించింది. చిత్రావతినది ఒడ్డున కొండకోనల్లోని కుగ్రామమైన గొల్లపల్లి.. నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడింది. కనీసం రహదారి తాగునీటి సౌకర్యం లేని పుట్టపర్తి ప్రపంచ పటంలో విశిష్ఠస్థానం చాటుకుంది. అంచలంచెలుగా పుట్టపర్తి పంచాయతీలోకి ఎనుములపల్లి, బ్రహ్మణపల్లి, బీడుపల్లి, బడేనాయక్‌తండా పంచాయతీలు విలీనం చేసి.. 2006లో మేజర్‌ పంచాయతీగా ఏర్పడింది. 2011లో నగర పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014లో ప్రథమంగా నగర పంచాయతీ ఎన్నికలు జరిగాయి.

శ్రీసత్యసాయి జిల్లాగా గతేడాది ఏప్రిల్‌ 4న ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి నగర పంచాయతీని గ్రేడ్‌2 మున్సిపాలిటీగా చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2011 లెక్కల ప్రకారం 31,610 మంది జనాభా, 59.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో 518 చదరపు కిలోమీటర్ల జనసాంద్రతగా పుట్టపర్తి నగర పంచాయతీగా ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 40 వేలు మంది ఉండటం, పుట్టపర్తి నగర పంచాయతీ సంవత్సర ఆదాయం రూ.4.47 కోట్లు వస్తోంది దేశ, విదేశీ భక్తులు ప్రతి ఏటా ఆరు లక్షల మంది పుట్టపర్తికి సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వస్తుంటారు. గ్రేడ్‌2 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని 2022 నవంబరులో కౌన్సిల్‌ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి పంపారు. జిల్లా కేంద్రంగా ఏర్పడినందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ.. ఏపీ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్‌ 18 జీవో జారీ చేసింది. పుట్టపర్తి మున్సిపాలిటీగా ఏర్పాటు వల్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు వస్తాయి. అయితే ప్రజలపై పన్నుల భారం పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని