logo

ఉపాధి హామీపై కేంద్రం నిర్లక్ష్యం: వ్య.కా.స

వలసలను నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి విమర్శించారు.

Published : 04 Feb 2023 04:00 IST

నిరసన తెలుపుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: వలసలను నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి విమర్శించారు. శుక్రవారం నగరంలోని గడియార స్తంభం కూడలిలోని గాంధీజీ విగ్రహం ఎదుట వ్యకాస నాయకులు, కూలీలతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ బడ్జెట్‌లో ఉపాధికి కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించి.. గ్రామీణ నిరుపేద కూలీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధికి ప్రోత్సాహం, నిధులు ఇవ్వకపోవడంతో కూలీలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.2లక్షల 40వేల కోట్లు కేటాయించాలని, కూలీలకు ఏడాదికి 200 పని దినాలు కల్పించి, రోజు కూలి రూ.600 చెల్లించాలని డిమాండు చేశారు. వ్య.కా.స నాయకులు సంగప్ప, బండారు శివ, శ్రీనివాసులు, రామకృష్ణ, ఎర్రపోతన్న, వెంకట్‌, నారాయణ, నారప్ప, మౌలాలి, రసూల్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని