logo

ఇద్దరికి విదేశీ విద్యా దీవెన

జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.32.68లక్షలు అందించామని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 04:00 IST

నమూనా చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.32.68లక్షలు అందించామని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీసీ హాలులో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అంతకుముందు సీఎం జగన్‌ ఈ పథకాన్ని ఆవిష్కరించారు. తర్వాత కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 200 వర్శిటీల్లో చదివే పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల కోసం ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తొలి విడతగా పై మొత్తాన్ని అందించామన్నారు. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అర్హత కలిన వారు సంబంధిత వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం నమూనా చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, రజక, ఆర్టీసీ, నాటక అకాడమీ, ఏడీసీసీ ఛైర్‌పర్సన్లు రంగన్న, మంజుల, హరిత, లిఖిత, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ రామలక్ష్మి, ఉప మేయర్లు వాసంతి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమాధికారులు విశ్వమోహన్‌రెడ్డి, ఖుష్బూ, అన్నాదొర, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని