logo

జాతీయ ప్రతిభా పరీక్షలకు పోటీ

నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

Published : 04 Feb 2023 04:00 IST

5న ఉమ్మడి జిల్లాలో పరీక్షలు
ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌ వరకూ ఉపకారవేతనం

అనంతపురం విద్య, పుట్టపర్తి గ్రామీణ, కొత్తచెరువు, న్యూస్‌టుడే: నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన జరిగినా ఇంత వరకూ ప్రభుత్వ పరీక్షలన్నీ ఉమ్మడిగానే నిర్వహించారు. జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్షలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 11 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. 2,596 మంది విద్యార్థులు అనంత జిల్లా నుంచి ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ ఏటా రూ.12వేలు ఉపకారవేతనం లభిస్తుంది. అయితే విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో ఉండకూడదు. ఉపకార వేతనానికి ఎంపికైన తరువాత కూడా ఇంటర్‌ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది.


వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయులు పాఠశాల యూడైస్‌ కోడ్‌ను ఉపయోగించి పాఠశాల లాగిన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్కనిమిషం ఆలస్యమైనా అనుమతించరు.


పకడ్బందీగా నిర్వహిస్తాం

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. చరవాణి, ఎలక్ట్రికల్‌ పరికరాలు అనుమతించం. ఓఎంఆర్‌షీట్‌లో సమాధానాలు నింపాల్సి ఉంటుంది. హాల్‌టికెట్లు, పెన్నులు విద్యార్థులు తీసుకొని పరీక్షకు రావాలి.

గోవిందనాయక్‌, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని