logo

‘తప్పుడు నివేదికలకు మూల్యం చెల్లించుకోక తప్పదు’

ఉద్యోగం పట్ల అంకిత భావం, అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నత స్థాయి అధికారులకు పంపిన తప్పుడు నివేదికలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ హెచ్చరించారు.

Published : 05 Feb 2023 04:29 IST

విద్యార్థులతో విద్యావిషయాలు తెలుసుకుంటున్న రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌

మడకశిర, న్యూస్‌టుడే: ఉద్యోగం పట్ల అంకిత భావం, అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నత స్థాయి అధికారులకు పంపిన తప్పుడు నివేదికలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ హెచ్చరించారు. శనివారం మడకశిర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో విద్యా బోధన విషయాలపై చర్చించారు. 3,4,5 తరగతులను ఏ ఉపాధ్యాయులు బోధిస్తున్నారనే దానిపై అధికారులతో ఆరాతీశారు. అక్కడే ఉన్న డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓలు సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం అనంతరం ఏ స్థాయి ఉపాధ్యాయులు బోధించాలనే దానిపై క్షుణ్ణంగా తెలియజేసినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. డీఈఓ మీనాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. మడకశిరలో జరుగుతున్న నాడు-నేడు పనులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్‌ డీఈ పద్మావతిపై విరుచుకుపడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు పలికారని, డీఈతో పాటు మరికొంత మంది అధికారులకు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి, డీవైఈఓ రంగస్వామి, ఎంఈఓ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని