logo

పర్యాటకులు వస్తున్నా.. పర్యవేక్షణ శూన్యం

బీటీపీకి ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీళ్లు చేరాయి. 8 నెలలుగా వరద నీరు వస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపుగా 65 టీఎంసీలు హగరికి వదిలారు.

Published : 05 Feb 2023 04:29 IST

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: బీటీపీకి ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీళ్లు చేరాయి. 8 నెలలుగా వరద నీరు వస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపుగా 65 టీఎంసీలు హగరికి వదిలారు. ప్రాజెక్టు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉండటంతో రెండు ప్రాంతాల నుంచి నిత్యం 200 మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. సెలవురోజుల్లో వారిసంఖ్య అధికంగా ఉంటుంది. వారికి అవసరమైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. 2018లో అతిథిగృహం పరిసరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి చూపరులను ఆకట్టుకునేలా మొక్కలు, ఇతర ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణ లేకపోవడంతో అవన్నీ ఎండిపోయాయి. వాటిస్థానంలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపించేలా మారింది. కాపలాదారులు లేకపోవటంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని, పర్యవేక్షకులను నియమించాలని కోరారు. ఇక్కడి సమస్యలపై ప్రభుత్వానికి నివేదించినట్లు డీఈ వెంకటరమణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు