logo

ఎగువ భద్రతోసీమకు నష్టం

తుంగభద్ర జలాశయం పైభాగంలో నిర్మిస్తున్న ఎగువ భద్ర ఎత్తిపోతలతో  రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది.

Published : 05 Feb 2023 04:29 IST

స్పందించని వైకాపా ప్రభుత్వం..
రైతు సంఘం ఆందోళన

కలెక్టరేట్‌ ఎదుట సంఘం నాయకుల నిరసన

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం పైభాగంలో నిర్మిస్తున్న ఎగువ భద్ర ఎత్తిపోతలతో  రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అక్రమంగా ఎత్తిపోతలు నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నోరు విప్పలేదు. సీఎం జగన్‌ సైతం అసలు పట్టించుకోలేదు. సీమ జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లికార్జున ఆందోళన వ్యక్తం చేశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. దిగువన ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు ఒట్టిపోయి... తాగునీటికి  ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీమ జిల్లాలకు తుంగభద్ర జలాశయం ఎంతో ఉపయుక్తం. పైభాగంలో కర్ణాటక ఇష్టారీతిన ఎత్తిపోతలు, జలాశయాలు నిర్మించి వందలాది టీఎంసీలను అక్రమంగా తోడేస్తున్నట్లు విమర్శించారు. అరకొరగా వచ్చే నీటిని సైతం భద్ర ప్రాజెక్టుకు తరలించాలన్న కుట్ర సాగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ నిధులు సైతం కేటాయించిందన్నారు. సత్వరమే ఆ నిధులు వెనక్కి తీసుకోవడంతోపాటు... జాతీయ హోదాను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఏపీ సర్కార్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని అన్నారు. సంఘం నాయకులు రామకృష్ణ, బండి రామకృష్ణ, శ్రీకాంత్‌, మధు, రాము, మారుతి, వెంకట నారాయణ, చలపతి, రవీంద్ర, నరేష్‌, రెడ్డప్ప, గోవింద్‌ నాయక్‌, రాకెట్ల రాము పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని