logo

శివమాలధారుల వాహనం బోల్తా

ఇరుముడి సమర్పించుకుని తిరుగు ప్రయాణమైన శివమాలధారులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 05 Feb 2023 04:29 IST

ఐదుగురికి తీవ్రగాయాలు

ఒకరి పరిస్థితి విషమం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇరుముడి సమర్పించుకుని తిరుగు ప్రయాణమైన శివమాలధారులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన 19 మంది శివమాలధారులు శ్రీశైలం వెళ్లి స్వామిని దర్శించుకొని ఇరుముడి సమర్పించి శుక్రవారం స్వగ్రామానికి వాహనంలో బయల్దేరారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి నుంచి టమోటాలోడ్‌తో బొలెరో వాహనం అనంతపురం మార్కెట్‌కు బయల్దేరింది. బోరంపల్లి వద్దకు రాగానే శనివారం వేకువజామున 4.15సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. శివస్వాముల వాహనం ముందుచక్రాలు ఊడిపోయి రోడ్డుపక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. చిన్నపాటి గాయాలైనవారు మిగిలిన వారిని రక్షించారు. గ్రామస్థులు అక్కడికి చేరుకుని సాయం అందించారు. చికిత్స నిమిత్తం 108 వాహనాల్లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందరూ గాయపడగా ఈరన్న పరిస్థితి విషమంగా ఉంది. తిప్పేష్‌, హనుమంతరాయుడు, బొమ్మయ్య, రాజప్పకు తీవ్ర గాయాలవగా అనంతపురం తరలించారు. మిగిలినవారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను మంత్రి ఉష ఆసుప్రతిలో పరామర్శించారు. ఉదయానికల్లా స్వగ్రామానికి చేరుకుంటామని కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడామని, ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని