సూదిమందు వికటించి బాలుడి మృతి
సూదిమందు వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని అమ్మలదిన్నె గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
నిశాంత్ ( పాతచిత్రం)
పెద్దపప్పూరు, న్యూస్టుడే : సూదిమందు వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని అమ్మలదిన్నె గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరేంద్రబాబు కుమారుడు నిశాంత్ (4) అనే బాలుడికి జలుబు, దగ్గు ఉండడంతో శుక్రవారం స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు శేషాచారి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు బాలున్ని పరిశీలించి జ్వరం కూడా ఉందని ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్ది సేపటికే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆర్ఎంపీ వైద్యుడు మరో సూదిమందు ఇచ్చారు. ఎంతకీ స్పృహ రాకపోవడంతో నరేంద్రబాబు కుమారున్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ వాహనంలో తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారున్ని కోల్పోయామని నరేంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంపై ఎస్ఐ ఖాజాహుసేన్ను వివరణ కోరగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మండల వైద్యాధికారి కల్యాణ్కుమార్తో ప్రస్తావించగా అమ్మలదిన్నె ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు వైద్య సిబ్బందిని పంపినట్లు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యుడు అందుబాటులో లేడన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!