logo

సీపీఎస్‌ అంతమే ఉపాధ్యాయుల పంతం

‘ప్రజాస్వామ్య ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తీవ్ర అన్యాయం. సీపీఎస్‌ రద్దు చేసే దాకా ఉపాధ్యాయుల ఉద్యమం ఆగదు.

Published : 06 Feb 2023 03:44 IST

దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, ప్రతినిధులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘ప్రజాస్వామ్య ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తీవ్ర అన్యాయం. సీపీఎస్‌ రద్దు చేసే దాకా ఉపాధ్యాయుల ఉద్యమం ఆగదు. మరింత ఉద్ధృతం చేస్తాం’ అని యూటీఎఫ్‌ తేల్చి చెప్పింది. ఆదివారం కలెక్టర్‌ కార్యాలయం ముందు ‘సంకల్ప దీక్ష’తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ ఈనెల 3న ఏలూరు నగరంలో నిర్వహించాల్సిన సీపీఎస్‌ రద్దు సంకల్ప దీక్షను ప్రభుత్వం పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ధ్వజమెత్తారు. బ్రిటీషు పాలనను ఎదుర్కొన్న ఉపాధ్యాయులకు జగన్‌ సర్కార్‌ నిరంకుశత్వాన్ని ఎదుర్కొవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. సీపీఎస్‌ రద్దు ఉద్యమానికి తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ సీఎం జగన్‌ గొప్పలు చెప్పారని, దీని స్థానంలో జీపీఎస్‌ విధానాన్ని తెరపైకి తీసుకుని రావడం అన్యాయం అన్నారు. పెన్షన్‌ భిక్ష కాదు... ఉద్యోగుల హక్కు అన్న సత్యాన్ని తెలియజేస్తామన్నారు. ఓపీఎస్‌ సాధించే దాకా ఉద్యమం ఆగదన్నారు. ఈ నిరసనలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు రమణయ్య, సహాధ్యక్షుడు రామప్ప, జిల్లా కార్యదర్శి అర్జన్‌, రాష్ట్ర నేతలు ఈశ్వరయ్య, అబ్దుల్‌ వహబ్‌, మహమ్మద్‌, సుధాకర్‌, గంగాధర్‌, నారాయణస్వామి, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని