logo

ట్రాన్స్‌కో ఏఈపై కేసు

అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డులోని ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ సబ్‌డివిజన్‌ 2లో విధులు నిర్వహిస్తున్న ఏఈ ఈశ్వర్‌పై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 06 Feb 2023 03:44 IST

రూ.35.42 లక్షల స్వాహా చేసినట్లు అభియోగం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డులోని ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ సబ్‌డివిజన్‌ 2లో విధులు నిర్వహిస్తున్న ఏఈ ఈశ్వర్‌పై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘రైతుల సొమ్ము స్వాహా’ శీర్షికన ఈనెల 2న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు సదరు ఏఈపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ వ్యవహారంపై డీఈఈ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏఈ ఈశ్వర్‌ రూ.35,42,948 సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేల్చారు. రైతుల పొలాల్లో టవర్లు ఏర్పాటు చేయడంతో పంట నష్ట పరిహారం మంజూరైంది. రైతులకు డబ్బు ఇచ్చినట్లు దొంగ సంతకాలు చేసి రసీదులను కార్యాలయంలో అందజేశాడు. దీంతో నిందితుడిపై 409, 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు