logo

గురి తప్పని బాణం.. హవిష

చదువులో ప్రతిభ చూపుతోంది.. దీనికి తోడు చిన్నప్పటి నుంచి విలు విద్య, స్కేటింగ్‌పై మక్కువ పెంచుకుంది.. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మెరిసింది..

Published : 07 Feb 2023 04:42 IST

జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం కైవసం

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: చదువులో ప్రతిభ చూపుతోంది.. దీనికి తోడు చిన్నప్పటి నుంచి విలు విద్య, స్కేటింగ్‌పై మక్కువ పెంచుకుంది.. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మెరిసింది.. తాను గురిపెట్టిన బాణం బంగారు పతకం సాధించింది.. ఆమె విద్యార్థిని కేపీ హవిష. ఆమె తల్లిదండ్రులు హిందూపురం పట్టణంలోని బంగారం వ్యాపారి కుంచం ఫణిరాజ్‌, సహన. విద్యార్థిని ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు హిందూపురంలో చదివింది. ప్రస్తుతం బెంగళూరులో న్యూ బాలవిన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కేటింగ్‌పై ఆసక్తి ఉండటంతో రెండు సంవత్సరాలు హిందూపురంలో శిక్షణ పొందింది. స్కేటింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. విలువిద్యపై కొంతకాలంగా ఆసక్తి పెంచుకొని శిక్షకురాలు కీర్తి వద్ద శిక్షణ పొందుతోంది. గత ఏడాది జూన్‌ నుంచి 5, 10, 15 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించటంలో అనతికాలంలోనే అపార ప్రతిభ చాటింది. గత ఏడాది నవంబర్‌లో బెంగళూరులో స్టేట్‌మీట్‌ పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకొంది. ఇటీవల మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య (అండర్‌-17) పోటీల్లో ప్రతిభ కనబరచి బంగారు పతకం సొంతం చేసుకొంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకొంటోంది. విద్యలో కూడా టాపర్‌గా రాణిస్తోంది.

అంతర్జాతీయంగా రాణించి.. సివిల్స్‌ సాధిస్తా

విలువిద్యలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు పొందిన తరవాత సివిల్స్‌ సాధించాలని ఉంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నాను. కోచ్‌ ఆటలోని మెలకువలు వివరిస్తూ శిక్షణ ఇస్తున్నందున అనతికాలంలోనే జాతీయ పోటీల్లో రాణించగలిగాను. భవిషత్‌లో మరిన్ని పతకాలు సాధించాలన్న ధ్యేయంతో ఉన్నాను.             - హవిష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని