logo

రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని ఆందోళన

జిల్లాలో సాగులో ఉన్న భూములను సత్వరమే రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుటు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

Published : 07 Feb 2023 04:42 IST

కలెక్టర్‌రేట్‌ వద్ద ధర్నా..

పుట్టపర్తి, న్యూస్‌టుడే : జిల్లాలో సాగులో ఉన్న భూములను సత్వరమే రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుటు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ పార్టీ, సంఘం నాయకులు, కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్పందనలో అర్జీలు ఇవ్వడానికి వస్తే గేట్లు వేస్తారా..? ఇదెక్కడి న్యాయం అంటూ.. నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన నాయకులు గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య చోటుచేసుకున్న తోపులాటలో కార్యాలయం గేటు విరిగిపోయింది. ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కార్యాలయం రెండో ద్వారం మూసి వేయడంతో అక్కడే కూర్చోని నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ముందుగా గణేశ్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఎం కార్యదిర్శ ఇంతియాజ్‌ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ నాయకులకు  యంత్రాంగం ఊడిగం చేస్తోందని విమర్శించారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం పరిధిలో దశాబ్దాలుగా రైతులు భూములు సాగు చేస్తున్నారని, భూ పంపిణీలో వారికి పట్టాలు అందించాలని డిమాండు చేశారు. పేదల భూములను అన్యాక్రాంతం చేసిన మంత్రి ఉషా, వైకాపా నేత మెట్టు గోవిందరెడ్డిలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.  కలెక్టర్‌ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.  జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌, నాయకులు గంగాధర్‌, నారాయణ, హనుమంతు, వెంకటేశ్‌, జగదీశ్‌, రంగప్ప పాల్గొన్నారు.

లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీపీఎం, రైతు సంఘం నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని