logo

జీ-20 ప్రతినిధుల పర్యటన నేడు

జీ-20 దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు మంగళవారం కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి ఉదయం 9గంటలకు ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశిస్తారు.

Published : 07 Feb 2023 04:42 IST

400 మంది పోలీసులతో బందోబస్తు

ఆమిదాలగొంది సమీపంలో పావగడ రహదారిని పరిశీలిస్తున్న అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు

లేపాక్షి, మడకశిర, న్యూస్‌టుడే: జీ-20 దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు మంగళవారం కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి ఉదయం 9గంటలకు ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశిస్తారు. పావగడ సమీప తిరుమణిలో ఉన్న సోలార్‌ఫ్లాంట్‌ను మధ్యాహ్నం  సందర్శిస్తారు. అక్కడి నుంచి లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని సాయంత్రం 4 గంటలకు సందర్శించి ఆలయ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం 4.45 గంటలకు తిరిగి బెంగళూరు వెళతారు. డీఐజీ రవిప్రకాష్‌ నేతృత్వంలో ఎస్పీలు ఫకీరప్ప, రాహుల్‌సింగ్‌ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సోమవారం  పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌, డీఎస్పీలు యశ్వంత్‌, భవ్యకిషోర్‌ లేపాక్షి ఆలయం పరిసరాలు కలియతిరిగి బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకులు గోపినాథన్‌, కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణారెడ్డి ఆలయ ప్రాంగణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందిపై సూచనలు చేశారు. డీఎస్పీలు మాట్లాడుతూ 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, మీడియా ప్రతినిధులకు ఆలయంలోకి అనుమతులు లేవన్నారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వీధులన్నీ బారికేడ్లు ఏర్పాటుచేశారు.   అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం కొడికొండ నుంచి చిలమత్తూరు, మడకశిర, పావగడకు వెళ్లే రహదారులను పరిశీలించి భద్రత ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని