logo

సమస్యలు పరిష్కరించలేని స్పందన ఎందుకు?

అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు స్పందన కార్యక్రమం నిర్వహించడం ఎందుకని వైకాపా నాయకుడు, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ కుమారమ్మ భర్త కృష్ణమూర్తి అధికారులను నిలదీశారు.

Updated : 07 Feb 2023 06:20 IST

నిలదీసిన వైకాపా నాయకుడు

అధికారులను ప్రశ్నిస్తున్న కృష్ణమూర్తి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు స్పందన కార్యక్రమం నిర్వహించడం ఎందుకని వైకాపా నాయకుడు, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ కుమారమ్మ భర్త కృష్ణమూర్తి అధికారులను నిలదీశారు. నగరపాలికలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలు ప్రస్తావించారు. వీధి దీపాలు, విద్యుత్తు మోటారు కాలిపోతే రెండు, మూడు నెలలైనా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీరు రాకుంటే ప్రజలు ఏం తాగాలని ప్రశ్నించారు. తాను ఫిర్యాదు ఇచ్చి ఎన్ని నెలలైందో ఓసారి చూడండంటూ అసహనం వ్యక్తం చేశారు. మోటారు కాలిపోయి పది రోజులుగా నీరు రాకపోతే ఆ సంతకం ఈ సంతకం అంటూ ఆలస్యం చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడినా ఫర్వాలేదా అని మండిపడ్డారు. నెలకోసారి విద్యుత్తు దీపాలు లారీ లోడ్లు తెప్పిస్తే అవి పది రోజులకే అయిపోతాయా? ఎక్కడకు పోతున్నాయో డివిజన్లవారీగా లెక్కలు చెప్పాల్సిందేనన్నారు. స్పందన కార్యక్రమంలో ఉపమేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్‌రెడ్డితో పాటు నగరపాలక డిప్యూటీ కమిషనరు సావిత్రి, కార్యదర్శి సంగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని