logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి రైతుభరోసా ఇచ్చారట!

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. అయినా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు...

Published : 08 Feb 2023 06:15 IST

పాసుపుస్తకం లేకపోయినా.. లబ్ధి పొందినట్లు కరపత్రం అందజేత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. అయినా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కరపత్రాన్ని అందజేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఓబుళదేవరచెరువుకు చెందిన పిట్టా రాజారెడ్డి కుమారుడు పిట్టా మధుసూదన్‌రెడ్డి బెంగళూరులోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేస్తున్నారు. ఈయన పేరు మీద పాసుపుస్తకం కూడా లేదు. కానీ, ప్రభుత్వం నుంచి ఈ మూడేళ్ల కాలంలో వైఎస్సార్‌ రైతుభరోసా పథకం కింద రూ.38,500, వైఎస్సాఆర్‌ సున్న వడ్డీ కింద రూ.1,132 కలిపి మొత్తం రూ.39,632 లబ్ధి పొందినట్లు కరపత్రం అందజేశార]ని తండ్రి రాజారెడ్డి తెలిపారు. తమ కుమారుడికి ఎలాంటి లభ్ధి అందకపోయినా.. అందించినట్లు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి ఇలియాజ్‌కు వివరణ కోరగా వైఎస్సార్‌ రైతుభరోసా జాబితాను పరిశీలించి చెబుతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని