logo

ప్లాట్లు వేసినా, మట్టి తరలించినా.. అనుమతులుండవ్‌!

మండలంలో స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమీపంలోని కొండ నుంచి ఎర్రమట్టి పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు.

Published : 08 Feb 2023 06:20 IST

ముదిగుబ్బలో అక్రమంగా తరలించిన ఎర్రమట్టితో చదునుచేసిన భూమి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలో స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమీపంలోని కొండ నుంచి ఎర్రమట్టి పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 42వ జాతీయ రహదారి నాలుగులైన్లుగా విస్తరణ చెందుతుండటంతో చుట్టుపక్కల భూములకు విలువ మరింత పెరిగింది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు భూముల క్రయవిక్రయాలు ప్రారంభించారు. వ్యవసాయ భూములను ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లుగా మారుస్తున్నారు. ప్లాట్లుగా మార్చిన భూములకు రాళ్లఅనంతపురం సమీపంలో కొండ నుంచి ఎర్రమట్టి అనుమతుల్లేకుండా తరలించి చదును చేస్తున్నారు. పంచాయతీల ఆదాయానికి భారీగా గండికొడుతూ రోడ్డుకిరువైపులా ప్లాట్లువేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీటిపై తహసీల్దార్‌ నాగేంద్రను వివరణ కోరగా పరిశీలించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సిబ్బందికి సూచిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని