logo

‘సత్యసాయి’ కార్మికుల సమ్మె విరమణ

శ్రీసత్యసాయి తాగునీటి పథకం కింద ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించారు. శ్రీరాంరెడ్డి పథకం కింద పనిచేస్తున్న కార్మికులు సమ్మెలోనే కొనసాగుతున్నారు.

Published : 21 Mar 2023 03:12 IST

లక్ష్మీనగర్‌(అనంతపురం), ఉరవకొండ, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి తాగునీటి పథకం కింద ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించారు. శ్రీరాంరెడ్డి పథకం కింద పనిచేస్తున్న కార్మికులు సమ్మెలోనే కొనసాగుతున్నారు. సోమవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జవహర్‌కుమార్‌, సత్యసాయి బోర్డు డీఈలు రామారావు సీఐటీయూ నేతలు ఓబులు, నాగేంద్రప్రసాద్‌, తాగునీటి పథకం సంఘం నేతలు తిప్పేస్వామిలతో చర్చలు జరిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో సమ్మెను విరమించి విధుల్లోకి చేరుతున్నట్లు నేతలు, కార్మికులు ప్రకటించారు. గతంలో సమ్మెలోకి వెళ్లిన 19 రోజులకు సంబంధించిన వేతనం జమ చేస్తామని, చనిపోయిన ఆరుగురు కార్మికుల కుటుంబాలకు రూ.7లక్షల గ్రాడ్యుటీ మొత్తాన్ని అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. బకాయి విడుదలకు చర్యలు తీసుకుంటామని, కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ మొత్తాన్ని గుత్తేదారులతో కట్టిస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరటంతో సత్యసాయి బోర్డు పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికీ నీటి సరఫరా జరగనుంది.

పట్టువీడని శ్రీరాంరెడ్డి తాగునీటి పథకం కార్మికులు

శ్రీరాంరెడ్డి తాగునీటి పథకం సంఘం నేతలతో డీఈ శ్రీనివాసులు చర్చలు జరపగా సమ్మె విరమించేందుకు వారు అంగీకరించలేదు. దీంతో సుమారు 600 గ్రామాల వరకు నీటి సరఫరా నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని