logo

ఈదురు గాలుల బీభత్సం

ఉమ్మడి జిల్లాల్లో ఇటీవల భారీగా గాలులూ వీస్తూ కురిసిన వర్షానికి వివిధ సామర్థ్యాలున్న విద్యుత్తు నియంత్రికలు 6, స్తంభాలు 270 నేలకొరిగాయి.

Published : 21 Mar 2023 03:12 IST

విద్యుత్తుశాఖకు రూ.27 లక్షల నష్టం

అనంత(విద్యుత్తు),న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల్లో ఇటీవల భారీగా గాలులూ వీస్తూ కురిసిన వర్షానికి వివిధ సామర్థ్యాలున్న విద్యుత్తు నియంత్రికలు 6, స్తంభాలు 270 నేలకొరిగాయి. దీంతో విద్యుత్తుశాఖకు రూ.27 లక్షలు నష్టం వాటిల్లిందని ఆ శాఖ ఎస్‌ఈ సురేంద్ర తెలిపారు. 59 గ్రామాల్లో విద్యుత్తు సమస్యలు తలెత్తి సరఫరా నిలిచిపోయిందన్నారు. వెంటనే మరమ్మతులు చేయించి పడిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించామన్నారు. ప్రస్తుతం చక్రాయపేట, శివపురం, పోతురాజుకాలవ, బండమీదపల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి వరకూ మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు సరఫరా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏవైనా విద్యుత్తు సమస్యలు తలెత్తితే వెంటనే 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని