logo

గ్యాస్‌ సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తే చర్యలు

గ్యాస్‌ రవాణా ఛార్జీలు డెలివరీ బాయ్స్‌ అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శోభారాణి హెచ్చరించారు.

Published : 21 Mar 2023 03:12 IST

జిల్లా వ్యవసాయం: గ్యాస్‌ రవాణా ఛార్జీలు డెలివరీ బాయ్స్‌ అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శోభారాణి హెచ్చరించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్యాస్‌ సిలెండర్లు నిల్వ చేసే గోదాము నుంచి 5 కిలో మీటర్ల వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదన్నారు. 5-15 కి.మీ. మధ్య ఉంటే రూ.20, రూ.15 కి.మీ. దాటితే రూ.30 వరకు రవాణా ఛార్జీలు చెల్లించాలన్నారు. రవాణా ఛార్జీల పేరుతో అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఎస్‌వో హెచ్చరించారు. ఎవరైనా డెలివరీ బాయ్స్‌ డిమాండు చేస్తే ట్రోల్‌ ఫ్రీ నంబరు 1906-1967 ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని