logo

పక్కాగా రాగి జావ పంపిణీ

ఎలాంటి లోటుపాట్లు లేకుండా జగనన్న గోరుముద్ద కింద రాగిజావ అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 21 Mar 2023 03:35 IST

పుట్టపర్తి గ్రామీణం : రాగి జావ పంపిణీ ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ఎలాంటి లోటుపాట్లు లేకుండా జగనన్న గోరుముద్ద కింద రాగిజావ అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా రాగిజావ అందించడం, గృహనిర్మాణం, నాడు - నేడు, గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు తదితర అంశాలపై కలెక్టర్‌ జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాగిజావ అందలేదనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని, ఆ మేరకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. సత్యసాయి ట్రస్టు రాష్ట్రంలో 38 లక్షల మంది విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరాలు, ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఫీవర్‌ సర్వే పూర్తిగా 100 శాతం చేపట్టాలన్నారు. గృహ నిర్మాణం, ప్రభుత్వ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీపీవో విజయ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళిరెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, పీఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీసీఓ కృష్ణానాయక్‌, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఈఓ మీనాక్షి, ఆరోగ్యశ్రీ అధికారి యల్లప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన

పుట్టపర్తి గ్రామీణం : సోమవారం కొత్తచెరువు బాలుర జూనియర్‌ కళాశాలలో చేపట్టిన రాగిజావ పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్‌, డీఈవో మీనాక్షితో కలిసి పరిశీలించారు. వర్చువల్‌ విధానంలో సీఎం ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని