logo

బాధిత రైతులను తక్షణం ఆదుకోవాలి

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని సత్వరమే ఆదుకోవాలని భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి కనంపల్లి చిరంజీవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 21 Mar 2023 03:30 IST

దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి తదితరులు

అరవిందనగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే : అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని సత్వరమే ఆదుకోవాలని భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి కనంపల్లి చిరంజీవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భాజపా నాయకులు సోమవారం శింగనమల మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల కష్ట నష్టాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతుల్లో ఒక్కొక్కరు ఎకరాకు రూ. 5లక్షలు పైగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడుల కోసం  బ్యాంకుల్లో బంగారు నగలు కుదవపెట్టి అప్పులు తెచ్చారన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులతో అధిక వడ్డీతో అప్పులు చేశారన్నారు. ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. భాజపా నాయకులు రవిరాజు, రాజేశ్‌, అశోక్‌రెడ్డి, కిసాన్‌ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజినేయులు, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని