logo

కోలాహలంగా రథోత్సవం

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు.

Published : 24 Mar 2023 06:05 IST

ప్రత్యేక అలంకరణలో మూలవిరాట్‌

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఆంజనేయస్వామి వారి మూలవిరాట్టుకు సుప్రభాతసేవ, మహాభిషేకం అనంతరం స్వర్ణకవచ, వజ్రకిరీటం అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో క్యూలైన్లతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 5 గంటలకు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. కస్తూరిబా ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు కోలాటం ప్రదర్శించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నటరాజ నృత్యాలయ గుంతకల్లు వారితో నృత్యరూపకం, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ఏఈఓ ధనుంజయ, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, తహసీల్దారు రాము, డీఎస్పీ నర్సింగప్ప, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

భక్తజన సందోహం నడుమ ముందుకు సాగుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని