logo

ప్రభుత్వ ఇళ్ల స్థలాల కబ్జా

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించిన ఇళ్ల స్థలాల్లో ఖాళీగా ఉన్నవాటిపై అధికార పార్టీ నాయకులు కన్నేస్తున్నారు.

Published : 24 Mar 2023 06:05 IST

పోతులనాగేపల్లి లేఅవుట్‌లో కబ్జా చేయడానికి చదును చేసిన స్థలం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించిన ఇళ్ల స్థలాల్లో ఖాళీగా ఉన్నవాటిపై అధికార పార్టీ నాయకులు కన్నేస్తున్నారు. జగనన్న లేఅవుట్‌లో చివరన మిగిలిన సెంటు, సెంటుకుపైగా ఉన్న ఖాళీ జాగాలను కబ్జా చేస్తున్నారు. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారులకు సెంటున్నర స్థలం కేటాయించారు. ఈ స్థలం శివారున ఖాళీ జాగా నిలిచిపోయింది. వాటిని స్థానిక నేతలు చదును చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. సెంటు రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారు. అడిగితే రెవెన్యూ నుంచి పట్టా పొందామని చెబుతున్నారని స్థానికులు తెలిపారు. ఖాళీ స్థలాల్లో తామెవరికీ పట్టాలు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని