logo

జాగ్రత్తలతో ప్రమాదాలకు అడ్డుకట్ట

వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే అధికశాతం ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని వక్తలు తెలిపారు.

Published : 26 Mar 2023 03:09 IST

ప్రదర్శనగా వస్తున్న వైద్య విద్యార్థులు

అనంత(వైద్యం), న్యూస్‌టుడే: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే అధికశాతం ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని వక్తలు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెదడుకు తగిలే గాయాలపై అవగాహన కల్పించేందుకు శనివారం వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సూపర్‌స్పెషాలిటీ సూపరిటెండెంట్‌లు డాక్టర్‌ రఘునందన్‌, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, అడిషనల్‌ ఎస్పీ హనుమంతప్ప, ఎంవీఐ సురేష్‌నాయుడు, న్యూరోసర్జరీ విభాగం హెచ్‌వోడీ భాస్కర్‌ మాట్లాడారు. దేశంలో ఏడాదికి రోడ్డు ప్రమాదాలు 1.50 లక్షలకు పైగా జరుగుతున్నాయని, అందులో 70 శాతం ద్విచక్రవాహనాల దుర్ఘటనలే ఉంటున్నాయని వివరించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, కారు నడిపేవారు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. తలకు సంబంధించిన శస్త్రచికిత్సలు సూపర్‌స్పెషాలిటీలో న్యూరోసర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా చేస్తున్నారని, అవసరమైన వారు ఇక్కడికొచ్చి వైద్యసేవలు పొందాలన్నారు. వైద్యులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని