logo

‘ఆసరా’తో మహిళలకు ఊరట

పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆసరా పథకం మేలు చేకూరుస్తుందని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ వీసీ హాలులో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

Published : 26 Mar 2023 03:09 IST

నమూనా చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి,
రామచంద్రారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ తదితరులు

జిల్లా సచివాలయం: పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆసరా పథకం మేలు చేకూరుస్తుందని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ వీసీ హాలులో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 31,229 పొదుపు సంఘాల మహిళలకు రూ.236.66 కోట్ల సాయాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకుల్లో అప్పును మాఫీ చేసే ప్రక్రియ విడతలవారీగా చేస్తున్నామన్నారు. మూడో విడత మొత్తాన్ని సంఘాల ఖాతాలకు జమ చేసినట్లు వివరించారు. అనంతరం నమూనా చెక్కు అందించారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, నగర మేయర్‌ వసీం, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత, ఉప మేయర్లు వాసంతి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు