logo

ఆర్బీకేలతో సహకార సంఘాల అనుసంధానం

రైతు భరోసా కేంద్రాలతో సహకార సంఘాలను ప్రభుత్వం అనుసంధానం చేసిందని ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్‌ ఎం.లిఖిత తెలిపారు.

Published : 26 Mar 2023 03:09 IST

ప్రసంగిస్తున్న బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖిత, అధికారులు

తపోవనం(అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: రైతు భరోసా కేంద్రాలతో సహకార సంఘాలను ప్రభుత్వం అనుసంధానం చేసిందని ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్‌ ఎం.లిఖిత తెలిపారు. తద్వారా అనేక ప్రయోజనాలున్నాయన్నారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు మహాజన సభ శనివారం ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల్లో మరింత పారదర్శకత తేవడానికి ఏడాదిలో రెండు ఆడిట్లు నిర్వహిస్తారని తెలిపారు. సంఘాల స్థాయిలోనే రైతులతో నిర్ణీత కాల డిపాజిట్లు స్వీకరిస్తే ఆర్థికంగా బలోపేతమవుతాయని సూచించారు. ప్రతి సంఘం పరపతేతర వ్యాపారాలు చేయడానికి ముందుకు రావాలన్నారు. పెట్రోలు బంకుల నిర్వహణ, ఎరువులు, విత్తనాల వ్యాపారాల ద్వారా సొసైటీలను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖల్లో ఉద్యోగుల బదిలీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని పలువురు సభ్యులు తెలిపారు. ఒక విధానాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుకు అనుబంధంగా ఉన్న సొసైటీల్లో ఎక్కువ శాతం మనుగడలో లేవని వాటిని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలకు రుణ సదుపాయం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ రాంప్రసాద్‌ సూచించారు. సహకార సంఘాలన్నీ కంప్యూటరీకరిస్తే సేవలు మరింత సులభతరమవుతాయని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బ్యాంకు అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. నాబార్డు డీడీఎం అనురాధ, రెండు జిల్లాల డీసీఓలు ప్రభాకర్‌రెడ్డి, కృష్ణానాయక్‌, ఆప్కాబ్‌ జనరల్‌ మేనేజరు కృష్ణారావు, డైరెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రామాంజనేయులు, శంకరరెడ్డి, రమణమూర్తి, అబ్దుల్‌ రఖీబ్‌, జీఎం సురేఖరాణి, డీజీఎంలు సుఖదేవబాబు, రవికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు