logo

ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేయడం అన్యాయం

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను పాటించకుండా కేవలం ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు పాల్పడటం హేయమైన చర్య అని కాంగ్రెస్‌ నాయకులు అభివర్ణించారు.

Published : 26 Mar 2023 03:09 IST

మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను పాటించకుండా కేవలం ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు పాల్పడటం హేయమైన చర్య అని కాంగ్రెస్‌ నాయకులు అభివర్ణించారు. రాహుల్‌గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ శనివారం పీసీసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీకూడలి నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ లలిత్‌మోదీ, నిరవ్‌ మోదీ వేల కోట్ల రూపాయలు బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే, వారిని శిక్షించకుండా భాజపా కళ్లు మూసుకుందని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీని వేధించడం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండకూదనుకునే నేటి పాలకుల తీరు హేయమైందన్నారు. భాజపా ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పీసీసీ సభ్యులు తిమ్మప్ప, ఏ బ్లాక్‌ అధ్యక్షుడు జియావుద్దీన్‌, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, కళ్యాణదుర్గం, కంబదూరు మండలాల కన్వీనర్లు అశోక్‌, ఈరన్న, నాయకులు ఫకృద్దీన్‌, గోవిందు, దాదాపీర్‌, కృష్ణమూర్తి, ఉద్దీప్‌సింహా, ఈశ్వర్‌, రామాంజి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని