logo

ప్రతినెలా ఒకటిన జీతాలివ్వగలరా?

పండగలకు ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తారనే అభిప్రాయం ఎప్పుడో పోయిందని, తొడగొడితేనే వచ్చే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

Published : 27 Mar 2023 05:22 IST

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరుల ప్రదర్శన

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: పండగలకు ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తారనే అభిప్రాయం ఎప్పుడో పోయిందని, తొడగొడితేనే వచ్చే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సంఘం అనంతపురం జిల్లా ద్వితీయ కౌన్సిల్‌ సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. అంతకుముందు జడ్పీ హాల్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి ఉద్యోగులు ర్యాలీగా సప్తగిరి కూడలి మీదుగా సూర్యనగర్‌ రోడ్డు, పాతూరు వరకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌లో రాజమండ్రిలో జరిగే సంఘం సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చట్టబద్ధత, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పాదయాత్ర సందర్భంగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ రద్దు ప్రకటించినా ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ఉద్యోగుల్లో చైతన్యం చూసి ప్రభుత్వం ఆలోచనా విధానం మారుతోందన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని ప్రతినెలా ఒకటిన జీతాలు ఇస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపీకృష్ణ, రామునాయక్‌, మహిళా అధ్యక్షురాలు సాంబశివమ్మ, రాష్ట్ర కార్యదర్శి బాబాసాహెబ్‌, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రాజ్‌, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు