logo

ప్రజల్లో మార్పు మొదలైంది

వైకాపా నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో మార్పు మొదలైందని సినీ నటుడు నారా రోహిత్‌ పేర్కొన్నారు.

Updated : 27 Mar 2023 06:07 IST

మాట్లాడుతున్న నారా రోహిత్‌

కొత్తచెరువు, న్యూస్‌టుడే : వైకాపా నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో మార్పు మొదలైందని సినీ నటుడు నారా రోహిత్‌ పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో నారా రోహిత్‌ పాల్గొన్నారు. ఆయన కొత్తచెరువు మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నివాసంలో బసచేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ కోసం అవసరం అనిపించినప్పుడు తప్పక తాను కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. యువ నాయకుడు లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల్లో స్పందన భారీగా ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలు తెదేపాతోనే పరిష్కారమవుతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. గత నాలుగేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. మళ్లీ 2024లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వైకాపా ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయించడం, అణిచివేత ధోరణితో పాలన సాగిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని