logo

ఒరిగిన స్తంభం.. విరిగితే ప్రమాదం..!

ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి బ్రిడ్జి సమీపంలోని పొలాల్లో 11 కేవీ విద్యుత్తు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది.

Published : 27 Mar 2023 05:22 IST

ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి బ్రిడ్జి సమీపంలోని పొలాల్లో 11 కేవీ విద్యుత్తు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. స్తంభానికి ఆనుకుని విద్యుత్తు నియంత్రిక ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బలమైన గాలులు వీస్తే పొలాల్లోకి విరిగి పడుతుందని, విద్యుత్తు అధికారులు స్పందించి స్తంభాన్ని సరిచేయాలని రైతులు కోరుతున్నారు. వీటిపై విద్యుత్తు శాఖ ఏఈ చంద్రానాయక్‌ను వివరణ కోరగా పరిశీలించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

న్యూస్‌టుడే, ముదిగుబ్బ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు