logo

కంకర పరిచారు.. రోడ్డు వేయడం మరిచారు

విడపనకల్లు మండలంలోని పాల్తూరు నుంచి కరకముక్కల వైపు దాదాపు మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని ఉపాధిహామీ పథకం కింద పంచాయతీరాజ్‌ అధికారులు చేపట్టారు.

Published : 27 Mar 2023 05:22 IST

విడపనకల్లు మండలంలోని పాల్తూరు నుంచి కరకముక్కల వైపు దాదాపు మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని ఉపాధిహామీ పథకం కింద పంచాయతీరాజ్‌ అధికారులు చేపట్టారు. అందుకుగాను రూ.74లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా దారిని తవ్వి, కంకర పరిచారు. ఆరు నెలలుగా తారు రోడ్డు నిర్మించే విషయాన్ని అధికారులు విస్మరించారు. కంకర దారిలో రాకపోకలు సాగించడానికి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రివేళ చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గుత్తేదారుకు సకాలంలో బిల్లులు మంజూరు కాక పోవడంతోనే పనులు నిలిపివేసినట్లు తెలిసింది. పీఆర్‌ అధికారుల వివరణ కోరగా త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

న్యూస్‌టుడే, విడపనకల్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని