దుర్గం రోడ్లు అభివృద్ధి కావాలి
రాయదుర్గం పట్టణంలో తాను ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో రోడ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు అలాగే ఉన్నాయని పెద్దగా మార్పు లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్
తాను నివసించిన వీధిలో పర్యటిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్, మిత్రులు
రాయదుర్గం, రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: రాయదుర్గం పట్టణంలో తాను ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో రోడ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు అలాగే ఉన్నాయని పెద్దగా మార్పు లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో తాను చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఉన్న ఇల్లు, పరిసర వీధులను మిత్రులతో కలిసి న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం మిత్రుడు పామిడి నాగరాజు ఇంట్లో న్యాయమూర్తితోపాటు పూర్వవిద్యార్థులు, సహచర మిత్రులు సమావేశమయ్యారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ రాయదుర్గం, కళ్యాణదుర్గంలలో సబ్ కోర్టు లేదని, గతంలో ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదన్నారు. సబ్ కోర్టు మంజూరుకు సహకరించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. పట్టణం మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ జి.ఉపేంద్రరెడ్డి, పీఆర్ డీఈ రామ్మోహన్, పి.హెచ్.నాగరాజు, న్యాయవాది ఎస్.నరసింహప్రసాద్, జయంతి సురేష్‌కుమార్, తాయిబాబు, జి.శివశంకర్, ఉడేగోళం శివానంద తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టును ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ పరిశీలించారు. జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకానంద, కార్యదర్శి వన్నూరుస్వామి, న్యాయవాదులు పాల్గొన్నారు.
అనంతపురం(మూడోరోడ్డు): హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రమేష్ ఆదివారం జిల్లా కోర్టును సందర్శించారు. ఆయన ఇటీవల జిల్లా పరిపాలనా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జిల్లా కోర్టు ఆవరణలోని వివిధ కోర్టులను పరిశీలించారు. సౌకర్యాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌తో ఆరా తీశారు. అనంతరం కోర్టు సిబ్బందితో మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!