logo

తలబడి.. నిలబడి.. తెలుగు ఖ్యాతి చాటి..

ఆ పేరే ఓ నిత్య చైతన్యం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తలబడి నిలబడి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన పార్టీ తెలుగుదేశం అని శ్రేణులు ఎలుగెత్తి చాటాయి.

Published : 30 Mar 2023 03:44 IST


హిందూపురంలో...

ఆ పేరే ఓ నిత్య చైతన్యం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తలబడి నిలబడి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన పార్టీ తెలుగుదేశం అని శ్రేణులు ఎలుగెత్తి చాటాయి. బుధవారం ఉమ్మడి అనంత జిల్లాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి జై ఎన్టీఆర్‌, జై తెలుగుదేశం అంటూ నినాదాలు హోరెత్తించారు. ర్యాలీలు చేశారు. సీనియర్‌ కార్యకర్తలు, నేతలను ఘనంగా సత్కరించారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, శింగనమల, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరితో పాటు యాడికి, తలుపుల, బొమ్మనహాల్‌, బ్రహ్మసముద్రం, అమడగూరు, కణేకల్లు, నల్లమాడ, బుక్కపట్నం, ఓబుళదేవరచెరువు, కంబదూరు, పెద్దవడుగూరు, కుందుర్పి, శెట్టూరు తదితర మండలాల్లో వేడుకలు నిర్వహించారు.

తాడిపత్రిలో ర్యాలీ

కదిరి : నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు


అనంత జిల్లా కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, నాయకులు

రాయదుర్గంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద...

ఉరవకొండలో ప్రదర్శన...

గుంతకల్లులో..

ధర్మవరంలో పతాకావిష్కరణ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌

కళ్యాణదుర్గంలో...

న్యూస్‌టుడే బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని