logo

సర్‌డెనిమ్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మండలంలోని గలిబిపల్లి క్రాస్‌ వద్దనున్న జీన్స్‌ ప్యాంట్‌ ముడి వస్త్రం తయారీ పరిశ్రమ సర్‌ డెనిమ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Published : 30 Mar 2023 03:44 IST


గోదాములో ఎగిసిపడుతున్న మంటలు

లేపాక్షి, న్యూస్‌టుడే: మండలంలోని గలిబిపల్లి క్రాస్‌ వద్దనున్న జీన్స్‌ ప్యాంట్‌ ముడి వస్త్రం తయారీ పరిశ్రమ సర్‌ డెనిమ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న హిందూపురం, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న బోరుబావులకు మోటార్లు అమర్చి పైపుల ద్వారా మంటలను నియంత్రిస్తున్నారు. గోదాములో షిఫ్టుకు వంద మంది కార్మికుల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు అప్రమత్తమై భయాందోళనతో పరుగులు తీశారు. తరచూ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సంవత్సర కాలంలోనే మూడుసార్లు అగ్ని ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ముడి సరకు కాలి బూడిదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని