logo

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

శ్రీసత్యసాయి జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జేసీ చేతన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 03:44 IST

అధికారులతో సమీక్షిస్తున్న జేసీ చేతన్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జేసీ చేతన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, 716జీ, 342,44 రహదారులు, ఏపీఐఐసీ, వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ పనులకు కారణాలను రెవెన్యూ, ఇంజినీరింగ్‌ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం - తుమకూరు రైల్వే ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయరాదని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు పనులపై దృష్టి సారించి, వేగవంతంగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా సకాలంలో భూసేకరణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కదిరి, ముదిగుబ్బ, పెనుగొండ, బత్తలపల్లి తదితర ప్రాంతాల్లో అవార్డులు మంజూరైనప్పటికీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని, వెంటనే పూర్తి వివరాలు కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పేనాయక్‌, రాఘవేంద్ర, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని