logo

ఎండిన చీనీ చెట్లు.. వాడిన రైతుల ఆశలు

రూ.లక్షలు పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం కష్టించి పెంచిన చెట్లు కళ్లముందే ఎండుతుంటే చూడలేక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తాడిమర్రి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో 15 వేల ఎకరాల్లో రెండు లక్షలకు పైగానే చీనీ చెట్లు సాగులో ఉన్నాయి.

Published : 30 Mar 2023 03:44 IST

పొలుసు తెగులుతో తోటల తొలగింపు

ఎండిపోయిన చెట్టు ఇలా..

తాడిమర్రి, న్యూస్‌టుడే : రూ.లక్షలు పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం కష్టించి పెంచిన చెట్లు కళ్లముందే ఎండుతుంటే చూడలేక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తాడిమర్రి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో 15 వేల ఎకరాల్లో రెండు లక్షలకు పైగానే చీనీ చెట్లు సాగులో ఉన్నాయి. వందల కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా దిగుబడితో వచ్చే ఆదాయమే వారికి ఆసరా. ఈక్రమంలో పొలుసు తెగులు రైతులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచక నరికేస్తున్నారు. కోతకు వచ్చిన సమయంలో ఈ దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఉద్యాన అధికారులు సూచించిన మందులను పిచికారీ చేస్తున్నా ఫలితమివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఒక్క కునుకుంట్ల గ్రామంలోనే పొలుసు దెబ్బకు 8 వేల చెట్లను తొలగించారు.

150 చెట్లను తొలగించేశా..

గత ఏడాది నుంచి పొలుసు సోకడంతో ఇప్పటి వరకు 150 చెట్లను తొలగించేశా. మిగతా రోజూ మందులను ఉపయోగిస్తున్నా ప్రయోజనం కనబడటం లేదు. అధికారులు పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వాలి.  

బాబు, మేడిమాకులపల్లి

సకాలంలో మందులు పిచికారీ చేయాలి

పొలుసు సోకిన చెట్ల భాగంలో బంక మొత్తం తీసేయాలి. మైలుతుత్తంతో తయారు చేసిన బోర్‌డ్యాక్స్‌ మిశ్రమాన్ని చెట్లకు పట్టించాలి. బిందు సేద్యం పరికరాలను మొదలకు దూరంగా పెడితే ఆశించిన ప్రయోజనం ఉంటుంది.  ఆరు నెలలకోసారి ఇలా చేస్తే పూర్తిగా నివారించవచ్చు. అధికారులు సూచించిన మందులను సకాలంలో పిచికారీ చేయించాలి.

అమరేశ్వరి, ధర్మవరం డివిజన్‌ ఉద్యాన అధికారిణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని