logo

అంగన్‌వాడీ పోస్టులు 61.. దరఖాస్తులు 190

జిల్లాలో పది ప్రాజెక్టుల పరిధిలో 61 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు బుధవారంతో ముగిసింది.

Published : 30 Mar 2023 03:44 IST

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌): జిల్లాలో పది ప్రాజెక్టుల పరిధిలో 61 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు బుధవారంతో ముగిసింది. తుది గడువు నాటికి మొత్తం 190 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ బి.ఎన్‌.శ్రీదేవి వెల్లడించారు. ఈనెల 23 నుంచి 29 దాకా ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలు దరఖాస్తులు స్వీకరించారు. ఎనిమిది కార్యకర్త పోస్టులకు 48 మంది, రెండు మినీ కార్యకర్త పోస్టులకు ఆరుగురు, 51 సహాయకుల(ఆయా) పోస్టులకు 136 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా అనంత, గుత్తి, ఉరవకొండ ప్రాజెక్టుల్లోనే పోటీ ఉండటం విశేషం. అనంత పట్టణ ప్రాజెక్టులో రెండు కార్యకర్తల పోస్టులకు ఏకంగా 27 మంది బరిలో ఉన్నారు. ఇక తక్కువ దరఖాస్తులు అందిన ప్రాజెక్టుల్లో కంబదూరులో రెండు పోస్టులకు రెండే దరఖాస్తులు వచ్చాయి. కళ్యాణదుర్గంలోనూ అంతే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని