logo

భాజపా కన్వీనర్ల నియామకం

జిల్లాలో భాజపా బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లను ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వరరెడ్డి కోరారు.

Published : 30 Mar 2023 03:44 IST

అరవిందనగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే: జిల్లాలో భాజపా బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లను ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వరరెడ్డి కోరారు. అనంతపురం జిల్లాలో ఆయా నియోజకవర్గాలవారీగా నియమితులైన కన్వీనర్ల వివరాలు బుధవారం ఆయన వెల్లడించారు. రాయదుర్గం - హీరోజీరావు, ఉరవకొండ - నిరంజన్‌, గుంతకల్లు - విశ్వనాథ్‌, తాడిపత్రి - రంగనాథరెడ్డి, శింగనమల - రవిరాజ, అనంతపురం - అశోక్‌కుమార్‌, కళ్యాణదుర్గం- దేవరాజులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియామక ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని