logo

‘పది’ విద్యార్థులకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలి

‘పదో తరగతి పరీక్షలు  పకడ్బందీగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని’ కలెక్టర్‌ నాగలక్ష్మి దిశానిర్దేశం చేశారు.

Published : 30 Mar 2023 03:44 IST

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌): ‘పదో తరగతి పరీక్షలు  పకడ్బందీగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని’ కలెక్టర్‌ నాగలక్ష్మి దిశానిర్దేశం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పలుశాఖల జిల్లా అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డీఈఓ సాయిరాం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శాఖలవారీగా ఏఏ ఏర్పాట్లు చేశారని ఆరా తీశారు. ప్రతి కేంద్రంలోనూ ఆరోగ్య కార్యకర్త, ఓఆర్‌ఎస్‌, ప్రాథమిక మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థుల ప్రయాణం సాగిస్తారు. ఆర్డినరీ బస్సులే కాదు.. ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కూడా ఆపాలి. వారి పాసును అనుమతించాలని సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ హనుమంతు, ఆర్‌ఐఓ సురేష్‌బాబు, డీవీఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని