logo

31 నుంచి వేసవి రైళ్లు..

గుంతకల్లు గుండా ప్రయాణిస్తున్న నాలుగు ప్రత్యేక రైళ్లను ఈనెల 31 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లుగా మార్చి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 30 Mar 2023 03:44 IST

గుంతకల్లు: గుంతకల్లు గుండా ప్రయాణిస్తున్న నాలుగు ప్రత్యేక రైళ్లను ఈనెల 31 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లుగా మార్చి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వారంలో రెండు రోజుల ప్రకారం ప్రయాణించనున్నాయి. బెళగావి- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- బెళగావి రైళ్లు (07335, 07336) ఈనెల 31 నుంచి జులై 1 వరకు రాయచూరు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, గదగ్‌, హుబ్బళ్లి మీదుగా ప్రయాణించనున్నాయి. ఇక శివమొగ్గ- చెన్నై, చెన్నై- శివమొగ్గ రైళ్లు (06223, 06224) కూడా వారంలో రెండు రోజులు ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి మీదుగా ప్రయాణిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని