logo

గడపగడపలో సమస్యలపై నిలదీత

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా తమ గ్రామంలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఎమ్మెల్యే పద్మావతిని దండువారిపల్లి గ్రామస్థులు నిలదీశారు.

Published : 01 Jun 2023 04:24 IST

ఎమ్మెల్యే పద్మావతిని ప్రశ్నిస్తున్న గ్రామస్థులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా తమ గ్రామంలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఎమ్మెల్యే పద్మావతిని దండువారిపల్లి గ్రామస్థులు నిలదీశారు. బుధవారం ఎమ్మెల్యే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి గ్రామస్థులతో కలసి ఎమ్మెల్యేను అడ్డుకుని, సమస్యలపై నిలదీశారు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా.. గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు చేయలేదన్నారు. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పి గుంతలు తవ్వి ఇప్పటికీ పనులు చేయలేదన్నారు. గ్రామంలో వసతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. దండువారిపల్లి చెరువుకు నీరు కూడా ఎంపీని అడిగి ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే శ్మశానవాటిక సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను నిలదీయడంతో సీఐ అస్రార్‌బాషా తమ సిబ్బందితో కలసి సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు