logo

జర్మనీ ప్రత్యేక ఒలింపిక్స్‌కు నలుగురి ఎంపిక

జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న వేసవి ప్రత్యేక ఒలింపిక్స్‌కు ఆర్డీటీ దివ్యాంగులు నలుగురు ఎంపికయ్యారు. ఆర్డీటీ పాఠశాలలో చదువుతున్న వీరు వివిధ అంశాల్లో ప్రత్యేక ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

Published : 02 Jun 2023 05:09 IST

ఎంపికైన దివ్యాంగులతో మాంచోఫెర్రర్‌

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న వేసవి ప్రత్యేక ఒలింపిక్స్‌కు ఆర్డీటీ దివ్యాంగులు నలుగురు ఎంపికయ్యారు. ఆర్డీటీ పాఠశాలలో చదువుతున్న వీరు వివిధ అంశాల్లో ప్రత్యేక ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాడ్మింటన్‌లో డి.షమీలా, ఎన్‌.లోకేష్‌, పవర్‌ లిఫ్టింగ్‌లో పి.సుధామణి, టేబుల్‌ టెన్నిస్‌లో జి.అలివేలమ్మ ఎంపికయ్యారు. పవర్‌ లిఫ్టింగ్‌ శిక్షకురాలిగా డి.ఆశాను నియమించారు. బెర్లిన్‌ ప్రత్యేక ఒలింపిక్స్‌ పోటీలు ఈనెల 12 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన దివ్యాంగులను గురువారం ప్రధాన కార్యాలయంలో ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్‌, డైరెక్టర్‌ దశరథ్‌ అభినందించారు. ప్రత్యేక ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి జిల్లాను అంతర్జాతీయ క్రీడాపటంలో నిలపాలని పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారు. అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని